25-07-2025 06:24:42 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పలిమెల మండలం నుండి విద్యార్థులు రావడం కొరకు బస్సును ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కు వినతి పత్రం సమర్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాళేశ్వరం నుండి వచ్చే విద్యార్థులకు బోమ్మపూర్ ఎక్స్ రోడ్ వద్ద బస్సులు ఆపాలని, పలిమెల మండలంలోని పలిమెల, సర్వాయిపేట, పంకేన, మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, సూరారం గ్రామాల నుండి ప్రభుత్వ కళాశాలకు విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారని వీరికి సకాలంలో బస్సులు లేకపోవడంతో కళాశాలకు ఆలస్యంగా రావడం జరుగుతుందని వెంటనే భూపాలపల్లి డిపో మేనేజర్ కల్పించుకొని బస్సులు నడిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.