25-07-2025 06:18:49 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులను ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆషాడ మాసం బోనాల జాతర పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహకరించడం పట్ల ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ ప్రాంగణంలో సిఐ కే శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఎస్సై ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అంతకుముందు ఆలయంలో అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు.