11-12-2025 12:00:00 AM
వికారాబాద్, డిసెంబర్- 10: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, తాండూ రు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని 225 గ్రామాలకు ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లతో చేరారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్, బొంరాస్పేట్, దుద్యాల్, కొడంగల్, తాండూరు నియోజకవర్గంలోని తాండూర్, బషీరాబాద్, యాలాల్, పెద్దముల్ లో మొత్తం 262 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 37 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 225 గ్రామపంచాయతీలకు, 1912 వార్డులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. నేడు జరిగే ఎన్నికల విధులలో ప్రిసైడింగ్ అధికారులు, ఓ పి ఓ లు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 1912 మందికి సిబ్బందికి ఎన్నికల విధులు వేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
నేడు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం పెద్దేముల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మరియు తాండూర్ ఎంపిడిఓ కార్యాలయం లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల ను పరిశీలించారు. తాండూర్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి... పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ని చెక్ చేశారు.
పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పా ట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొంరాస్ పేట్ ఎం పి డి ఓ కార్యాలయం లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లి... ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల నిర్వహణలో ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఎన్నికల సిబ్బందికి సూచించారు.