calender_icon.png 2 October, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

02-10-2025 12:00:00 AM

స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన ఎస్పీ - కలెక్టర్ 

గోపాలపేట అక్టోబర్ : స్థానిక ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల లెక్కింపునకు స్ట్రాంగ్ రూమును ఎస్పీ గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ యాదయ్యలు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ పగడ్బందీగా ఉండాలని ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం గోపాలపేట మండలం నర్సింగాయపల్లి డిగ్రీ కళాశాలను అదేవిధంగా జేఎన్టీయూ పీజీ కళాశాలల భవనాలను పరిశీలించారు.

స్థానిక ఎన్నికల్లో గోపాలపేట వనపర్తి పాన్గల్ కొత్తకోట పెబ్బేర్ పెద్దమందడి శ్రీరంగాపురం ఏదుల రేవల్లి మండలాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లెక్కింపు కేంద్రాలు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని మిగిలిన ఆత్మకూరు అమర్చింత మదనాపూర్ చిన్నంబావి వీపనగండ్ల మండలాలు జేఎన్టీయూ పోస్ట్ గ్రాడ్యుటి కళాశాలలో ఏర్పాటు చేసేందుకు అణువుగా ఉంటుందని వారు సూచించారు.

స్ట్రాంగ్ రూమ్ లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను సీసీ కెమెరాలు బార్కేడింగ్ తదితర ఏర్పాట్లు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదరణపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదరణపు కలెక్టర్ రెవెన్యూ భీమ్య నాయక్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య ఆర్డీవో సుబ్రహ్మణ్యం డి.ఎస్.పి వెంకటేశ్వరరావు తాసిల్దార్ రమేష్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ల వెంట ఉన్నారు.