02-10-2025 12:00:00 AM
ఎన్హెచ్ఎఐ డిప్యూటీ మేనేజర్ ప్రణతి
అడ్డకుల, అక్టోబర్ 1: అన్ని దానాల కన్న రక్తదానం మహా గొప్పదానమని ఎన్హెచ్‌ఎఐ డిప్యూటీ మేనేజర్ ప్రణతి అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా పశ్చిమ ఆంధ్ర టోల్ వేస్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని శాఖపూర్ టోల్ గేట్ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంను రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ బాబుల్ రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ లతో ఎన్ హెచ్ ఎ ఐ డిప్యూటీ మేనేజర్ ప్రణతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ ప్రమాదాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కో రారు. రక్తదానం ఇతరుల జీవితాల్లో వెలుగు లు వికసింపజేస్తుందని అన్నారు. టోల్ గేట్ సిబ్బంది ప్రతి ఏటా రక్తదానం చేయడం అభినదనీయమని రక్తదాతలను అభినందించారు. రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ యువకులు రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని పిలుపు నిచ్చా రు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో 178 తలసేమియా బాధితులకు తరచుగా ర క్తం అవసరమని అన్నారు.తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చే యాలని కోరారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు,యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ సి పి ఆర్, ఫస్ట్ ఎయిడ్ పై యువతకు ఆవాహన కల్పిస్తామని తెలిపారు.
అనంతరం రక్త దాతలను అభినందిస్తూ సరిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఆంధ్ర టోల్ వేస్ ప్రతినిధులు సురేందర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, రఘునందన్ , యోబి, కిరిటి, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.