calender_icon.png 2 October, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద భరితంగా రహదారి పట్టించుకోని అధికారులు

02-10-2025 12:00:00 AM

కల్వకుర్తి అక్టోబర్ 1 : కల్వకుర్తి తెలకపల్లి ప్రధాన రహదారిపై పంజుగుల సమీపంలో రోడ్డుపై  గోతులు ఏర్పడి ప్రమాద భరితంగా మారింది. ఈ మార్గంలో గత కొంతకాలంగా ఇసుక రవాణా టిప్పర్లు అధికంగా వెళ్లడం, వర్షాలు కురవడంతో రోడ్డు పూర్తిగా కుంగిపోయి భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు కార్లు దానిని గమనించకుండా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు.

అయినప్పటికీ అధికారులు ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నామమాత్రంగా గోతుల్లో కంకర పోసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు నిర్మాణం చేసి ఐదు సంవత్సరాలు గడవక ముందే ఎక్కడపడితే అక్కడ గోతులు ఏర్పడడం పట్ల వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ చే మరమ్మతులు చేయించాలని ప్రజలు డిమాండ్‌చేస్తున్నారు.