calender_icon.png 15 October, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి పండుగకు ఏర్పాట్లు

15-10-2025 01:15:42 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆహ్వానం

సనత్‌నగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) :- ఈ నెల 26న పద్మారావు నగర్‌లోని హమాలీ బస్తీలో బొడ్రాయి పండుగ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హమాలీ బస్తీ వాసులు పద్మారావు నగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి బొడ్రాయి పండుగ కు ఆహ్వానించారు.

హామాలీ బస్తీ ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాము కోరిన వెంటనే బొడ్రాయి ప్రతి ష్ట జరిపించారని ఎమ్మెల్యే కు వారు కృతజ్ఞతలు తెలిపారు. బొడ్రాయి ప్రతిష్ట జరిగి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 26 వ తేదీన ప్రత్యేక పూజ లు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వారు వివరించారు. కార్య క్రమంలో పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బస్తీ వాసులు సంపత్, కుషాల్, సత్యనారాయణ, నర్సింగ్, కాంతారావు, దుర్గ, లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.