వచ్చేయేడు కుంభమేళాకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు
మంత్రి శ్రీధర్ బాబుపై గురుతర బాధ్యత
కరీంనగర్, మార్చి5(విజయక్రాంతి):కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 35 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మొత్తం 10 మండలాల్లో 170 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తోంది.2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేం దుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దక్షిణ భారత కుంభమేలా తరహాలో ఘ నంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ. 942.80 కోట్లు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చే సింది.
ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి నుంచి మ ల్లాపూర్, రాయికల్, బీర్పూర్ మండలాల్లోని గోదావరి నది తీర ప్రాంతాలతో పాటు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం, వెల్గ టూరు మండలం కోటిలింగాల, మంథని వంటి ప్రధాన క్షేత్రాల తీరాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. గోదావరి తీరాన ఉన్న చిన్న ఆలయాల వద్ద కూడా స్నాన ఘ ట్టాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రధానంగా భక్తుల సౌకర్యాలు, పా ర్కింగ్ స్థలాలు, ఘాట్ల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తు న్నారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత మౌ లిక వసతులు, అభివృద్ధి పనులపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఒకే రోజు జగి త్యాల, పెద్దపల్లి జిల్లాలోని పుష్కరాలకు నాలుగు లక్షల మంది భక్తులు పుష్కర ఘా ట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నానాల ఘాట్లు, అవసరమైన అన్ని వసతులు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో పుష్కర ఘాట్‌లు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం కోమటికొండాపూర్, ఎర్ధండి, మూలరాంపూర్, వేములకుర్తి, యామాపూర్, ఫకీర్ కొండాపూర్ సారంగపూర్ మండలం కమ్మునూరు,రాయికల్ మండలం బోర్నపల్లి, మల్లాపూర్ మండలం మొగిలిపేట, కొత్తదాంరాజ్పల్లి, పాతదాంరాజ్పల్లి, వాల్గొండ, ఓబులాపూర్, వెంకట్రావుపేట,ధర్మపురి మండలం ధర్మపురి, తిమ్మాపూర్, రాయపట్నం,వెల్గటూర్ మండలం కోటిలింగాల, రామగుండం : గోలివాడ, గోదావరిఖని,కమాన్పూర్ మండలం సుందిళ్ల, మంథని మండలం కాశిపేట, మంథని, మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లు ఉన్నాయి.
శ్రీధర్‌బాబు భుజస్కంధాలపై..
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పర్యవేక్షణకు క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐ టి, పరిశ్రమ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బా బు చైర్మన్గా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్ర భాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి ల క్ష్మణ్ కుమార్ సభ్యులుగా..
ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సబ్ కమిటీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనుంది.




