calender_icon.png 20 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోథ్‌లో బీజేపీకి భవిష్యత్తు లేదు

20-12-2025 12:29:48 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు బీజేపీ నేతలు

తలమడుగు, డిసెంబర్ 19 (విజయక్రాం తి): బోథ్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఖాళీ అవుతోందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండ లం బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు, రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు, తాజా మాజీ విడిసి చైర్మన్ బడాల శ్రీకాంత్ రెడ్డి, తాజా మాజీ వార్డ్ మెంబర్లు సింగడి పవన్ రెడ్డి, నోముల నరేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మేర రమణ, తలమడుగు మండలం సుంకిడి గ్రా మా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ దాసరి లింగన్న తదితరులు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఖండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గెలుపొందిన బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు పలువురు ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా వారినీ సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్  మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

ష్టపడ్డ ప్రతీ కార్యకర్తలను గుర్తించేది బీఆర్‌ఎస్ పార్టీనే అని, అందరూ పార్టీ బలోపేతం కోసం కష్టపడితే పార్టీ పేరే అధికారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, మగ్గిడి నర్సమ్మ,ప్రకాష్, ఉప సర్పంచ్ జాదవ్ అజయ్,భీంరెడ్డి, దనందాస్ రెడ్డి, చెన్ రెడ్డి, మంగల్ ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, సద్దాం, రమేష్ రెడ్డి, మండల కన్వీనర్ తోట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.