సైబర్ ముఠా సభ్యుల అరెస్ట్

28-04-2024 01:11:51 AM

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంబోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. పెద్దూర్‌కు  చెందిన శివప్రసాద్.. కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ ద్వారా రూ.1.40 లక్షలు చెల్లిం చి కాంబోడియా వెళ్లాడు. అక్కడ తనతో చైనా కాల్ సెంటర్‌లో పనిచేయించి.. ఉద్యోగాలు ఇప్పిస్తామని, టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని అమాయకులను మో సం చేసేలా పురమాయించారు.

దీంతో శివకుమార్ తన తల్లి లక్ష్మికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆమె ఐదు రోజుల క్రితం జిల్లా ఎస్పీని కలిసి గోడు విన్నవించుకోగా కేసు నమోదు చేశారు. కాంబో డియా లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి స్థానిక పోలీసుల సాయంతో  శివప్రసాద్‌ను కాపాడారు. విచారణలో పోలీ సులు నలుగురు ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. జగిత్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్, పుణేకు చెందిన అబిద్ అన్సారీలను అరెస్ట్ చేశామని, ఉత్తప్రదేశ్‌కు, బిహార్‌లకు చెందిన మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.