11 May, 2026 | 4:12 AM

ఆర్టిజన్ ఉద్యోగి వికృత చేష్టలు

11-05-2026 03:01 AM
  1. మహిళల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్
  2. నిందితుడి అరెస్ట్,- 14 రోజుల రిమాండ్

హుస్నాబాద్, మే 10: మహిళలు, తోటి ఉద్యోగుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫిం గ్ చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగిని హుస్నాబాద్ సీఐ శ్రీను ఆద్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండ లం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన శ్రీబద్రి మహేష్ (39) విద్యుత్ శాఖలో ఆర్టిజన్‌గా పనిచేస్తున్నాడు. తన కార్యాలయంలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగులు, బంధువుల వాట్సాప్ స్టేటస్ ఫొటోలు, సోషల్ మీడియా చిత్రాలను సేకరించి ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్య హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి కేసు నమోదు చేశారు. సిఐ కొండ్ర శ్రీను ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం నింది తుడిని అరెస్ట్ చేసి హుస్నాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో సిద్దిపేట జైలుకు తరలించారు.