17-07-2025 09:57:06 PM
కొండపాక,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ లక్ష్యం అని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఉగ్రవుతున్నారని, ఈ పరిస్థితిని ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి, సిద్దిపేట డిపో మేనేజర్ కు ఫోన్ చేయగా సిద్దిపేట డిపో మేనేజర్ గురువారం జప్తి నాచారం గ్రామానికి బస్సు పంపించినందుకు కొబ్బరికాయలు కోట్టి రిబ్బన్ కటింగ్ చేసి, బస్సును ప్రారంభించారు. జప్తి నాచారం గ్రామానికి బస్సును పంపించినందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.