21-12-2025 04:59:32 PM
జిల్లా కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి నరసింహారెడ్డి
మర్రిగూడ,(విజయక్రాంతి): యరగoడ్లపల్లి గ్రామస్తుల త్రాగు నీటి అవసరాలను, తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న సమస్యను గత మూడు నెలల క్రితం ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ భాగంగా ప్రజల విన్నపం మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా బోర్ వెల్ ను వేయించారు. అంతేకాకుండా గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా 80 కేయూ, త్రీ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ ను మంజూరు చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ ను బిగించి, ట్రాన్స్ఫార్మర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెసు పార్టీ అద్యక్షులు రామదాసు శ్రీనివాసు, వార్డు మెంబర్లు, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు , తాజా మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.