21-12-2025 04:41:28 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజాజీవితంలో ఉంటే సంతోషమే అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామని, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 శాతం స్థానాలను గెలిచిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆరఎస్ ఎక్కడుందని, కేసీఆర్, హరీష్ రావు తప్పిదాలతోనే నదీజలాల సమస్యలు ఏర్పాడయని విరుచుకుపడ్డారు. వృథా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని, తెలంగాణ అప్పులపై కేసీఆర్ ఏం సమాదనం చెబుతారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. బీజేపీ 12 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..? అని, కాంగ్రెస్, బీజేపీ పాలనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా..? అని అడిగారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రై రాష్ట్రానికి చేసిందేంటో వివరించాలన్నారు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖాలాలు లేవని మహేష్ విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.