calender_icon.png 5 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ పరీక్షపై టీ-శాట్ స్పెషల్ లైవ్

05-05-2025 01:42:02 AM

  1. రేపు నిపుణ ఛానల్‌లో ప్రసారం
  2. సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి 

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో నిర్వహించబోయే టెట్ పరీక్షపై టీ-శాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీఈ వో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు టీ--శాట్ నిపు ణ ఛానల్ ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి నలుగురు నిపుణులు పాల్గొంటారని చెప్పారు.

పరీక్షలో ఎదుర్కోబోయే సమస్యలు, సమయ పాలన, పరీక్ష రాసే విధానం, జాగ్రత్తలు సబ్జెక్టుల వారీగా వివరిస్తారని పేర్కొన్నారు. జూన్ 15నుంచి 30వరకు 15 రోజుల పాటు నిర్వహించే పరీక్షలపై అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 040-23540326/726 లేదా టోల్ ఫ్రీ 1800 425 4039 నంబర్లలో సంప్రదించాలని సీఈవో వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. 

50 రోజులు 200 ఎపిసోడ్లు

ప్రభుత్వం జూన్ 15వ తేది నుంచి 30వరకు నిర్వహించే టెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం అరగంట నిడి విగల ప్రత్యేక పాఠ్యాంశాలను సుమా రు 200 ఎపిసోడ్స్ సిద్ధం చేసి ప్రసా రం చేస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టీ-శాట్ విద్య ఛానల్‌లో ఉదయం ఐదు గంట ల నుంచి ఏడు గంటల వరకు, నిపుణ ఛానల్‌లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రసారా లు కొనసాగుతున్నాయని తెలిపారు.