calender_icon.png 5 May, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

05-05-2025 01:23:57 AM

  1. రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో ‘భూభారతి’
  2. జిల్లాకో మండలం చొప్పున ఎంపిక
  3. దరఖాస్తుల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు
  4. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి):- రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని మొత్తం 28 మండలాల పరిధిలో సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని, రెవెన్యూశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని దశ ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 20 వరకు జిల్లాకో మండలం చొప్పున ఎంపిక చేసి భూభారతి పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే తమ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నదని వివరించారు. రైతులు అందించిన దరఖాస్తును రెవెన్యూశాఖ పరిశీలిస్తుంద ని, రైతులకు న్యాయం చేసి తీరుతుంద ని హామీ ఇచ్చారు. ఆయా జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సదస్సులను పర్యవేక్షిస్తా రని తెలిపారు. రెవెన్యూశాఖ సిబ్బంది ఎక్కడికక్కడ రైతుల సందేహాలను నివృ త్తి చేస్తారని స్పష్టం చేశారు.

గత ప్రభు త్వం అమలు చేసిన ధరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటికీ తమ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చ ట్టాన్ని అమలు చేస్తున్నారని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనేదే తమ సంకల్పమని తెలిపారు.

ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా భూభా రతి చట్టాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాం లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయించే వారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులకు ఇక అలాంటి ఇబ్బందులు రావని, రైతులు నిక్షేపంగా రెవెన్యూశాఖకు దరఖాస్తులు ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు.

చట్టం అమలయ్యే మండలాలు ఇవే.. 

జిల్లా                       మండలం

ఆదిలాబాద్                 భరోజ్

భద్రాద్రి కొత్తగూడెం        సుజాతనగర్

హనుమకొండ                  నడికుడ

జగిత్యాల                      బుగ్గారం

జనగాం                       ఘన్‌పూర్

జయశంకర్ భూపాలపల్లి రేగొండ

జోగుళాంబ గద్వాల్ ఇటిక్యాల్

కరీంనగర్                    సైదాపూర్

కొమరంభీం ఆసిఫాబాద్ 

పెంచికల్‌పేట్

మహబూబాబాద్ దంతాలపల్లి

మహబూబ్‌నగర్ మూసాపేట్

మంచిర్యాల భీమారం

మెదక్ చిల్పిచిడ్

మేడ్చల్ మల్కాజిగిరి కీసర

నాగర్‌కర్నూల్ పెంట్లవల్లి

నల్గొండ నకిరేకల్

నిర్మల్ కుంతాల

నిజామాబాద్ మెండోరా

పెద్దపల్లి ఎలిగేడ్

రాజన్న సిరిసిల్ల రుద్రంగి

రంగారెడ్డి కుందుర్గ్

సంగారెడి కొండాపూర్

సిద్దిపేట అక్కన్నపేట

సూర్యాపేట గరిడేపల్లె

వికారాబాద్ ధరూర్

వనపర్తి గోపాలపేట

వరంగల్ వర్థన్నపేట్

యాదాద్రి భువనగిరి ఆత్మకూరు