05-05-2025 02:55:28 AM
ఇల్లంతకుంట, మే04(విజయక్రాంతి): మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కోసం నిర్మించతలపెట్టిన భవన నిర్మాణ పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ లాబ్ దోహద పడుతుందన్నారు.
విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే సైన్సు పట్ల ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇల్లంతకుంమండలం గాలి పెళ్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ భూమి పూజ చేశారు.
కార్యక్రమాల్లో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి,పసుల వెంకటి, గుడిసె ఐలయ్య యాదవ్, ఎలగందుల ప్రసాద్, ఆకుల వెంకన్న, కేశవరెడ్డి, ఆనంద్ రెడ్డి, స్వప్న కరుణాకర్ రెడ్డి ,పాశం రాజేందర్ రెడ్డి, ఎం నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అల్లెపు రజనీకాంత్, కొమ్ముల నర్సింగం, ఎల్లారెడ్డి సంపత్ రెడ్డి, రమేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పులి కృష్ణ, సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కుంట రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.