10-12-2024 03:05:51 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. పెద్దఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు కనీసం రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు 50 లక్షల ఇన్సూరెన్స్, 50 వేలు మట్టి ఖర్చులు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్స్, పెండింగ్ బిల్లులు, పనిభారం తగ్గించి, సెలవు నిర్ణయం చేయాలని, ఇకా అనే పెండింగ్ బిల్లులకు పరిష్కారం చూపాలని కోరారు. దీంతో కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తుంటే పోలీసులు భారీగా మోహరించారు.