calender_icon.png 23 December, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు ఒక్కటే మన తలరాతను మార్చుతుంది

23-12-2025 06:11:42 PM

ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఎవరి జీవితంలోనైనా విద్యబ్యాసం ఒక్కటే వారి తలరాతను మార్చుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న అపెక్స్ సెంట్రల్ స్కూల్, రాజేంద్రనగర్‌లోని న్యూ రిషి హై స్కూల్, భగీరథ కాలనీలో గల మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్లలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను పదవతరగతి చదువుతున్న విద్యార్థులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. డిజిటల్ కంటెంట్ ద్వారా విద్య మరింత సులభంగా, సమగ్రంగా అర్థమవుతుందని, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఐఐఐటి కళాశాలలో ఎక్కువ శాతం మన ఉమ్మడి మహబూబ్‌నగర్ విద్యార్థులే అడ్మిషన్ పొందాలన్నదే తన లక్ష్యం అని ఎమ్మెల్యే చెప్పారు.