calender_icon.png 23 December, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

23-12-2025 06:17:42 PM

ముకరంపుర,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడాన్ని  నిరసిస్తూ  వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద తట్టలు, పారలు చేతబూని ధర్నా చేశారు. ఎఐఎఫ్బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోగిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లానాయకులు జిందం ప్రసాద్ లు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకతీతంగా తన ఊపిరిపోయంత వరకు ప్రజల కోసమే పనిచేసిన మహానుభావుడు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాల్లు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొడ్డానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే ఆ మహాత్ముని పేరు తొలగించి  వికజిత్ భారత్ జి రామ్ జి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, ఆ మహాత్మా గాంధీ ఏం తప్పు చేశాడని పేరు మారుస్తున్నారని అన్నారు.  ఇప్పటికైనా కేంద్ర  ప్రభుత్వo తక్షణమే స్పందించి  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయాలి.

లేనిపక్షంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు గుడి కందుల సత్యం,గిట్ల ముకుంద రెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు,కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సత్యరావు, రాజశేఖర్,మల్లేశం రాజేశం,అజయ్ గజ్జల శ్రీకాంత్, జి తిరుపతి నాయక్, గామినేని సత్యం,బాకం అంజయ్య, చెంచల మురళి, పుల్లెల మల్లయ్య రాయి కంటి శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్, శ్రీనివాస్,రాకేష్, సాయికుమార్, ఆకాష్, తదితరులు  పాల్గొన్నారు