15 April, 2026 | 9:08 AM

ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశైలంకు పుడమి పుత్ర అవార్డు

23-12-2025 06:25 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ కు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశైలంకు పుడమి పుత్ర అవార్డు లభించింది. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశైలంకు పుడమి పుత్ర అవార్డును తెలంగాణ వ్యవసాయ కమీషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశo, తెలంగాణ వ్యవసాయ కమీషన్ సభ్యులు భవాని రెడ్డి, గోపాల్ రెడ్డి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ చైర్మన్ రాజేoదర్ రెడ్డి, అవార్డు కమిటి అధ్యక్షులు పడమటి పావనిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.