calender_icon.png 23 December, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ ఆర్థిక సంస్కరణలతో దూసుకుపోతున్న భారతదేశం

23-12-2025 06:23:45 PM

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రధానిగా పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో నేడు ప్రపంచ దేశాలతో మనదేశం అన్ని రంగాల్లో పోటీ పడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నాయకులు పి.వి. చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు శ్రావణ్ నాయక్, వంగల విద్యసాగర్, దన్న సింగ్, పొన్నం మధు, సిరికొండ శివప్రసాద్, కుంభాల రాజు కుమార్, గంగుల దిలీప్,పర్వత మల్లేశం, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, చింతల కిషన్, మాదాసు శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, వీర దేవేందర్, సత్తినేని శ్రీకాంత్, సరిల్లా రతన్ రాజు, సుదర్శన్, స్వప్న శ్రీ, తదితరులు పాల్గొన్నారు.