23-12-2025 06:14:37 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): దివంగత, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లాహుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి వేడుకలు మంగళవారంపీవీ సేవాసమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలు అందరికి ఆదర్శమని, వీటిని నేటి, ముందు తరాల ప్రజలు, యువకులు, విద్యార్థులు అనుసరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీవీ సాహిత్య పీఠం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ విష్ణుదాసు గోపాల్ రావు, జిల్లా ఆర్గనైంగ్ సెక్రటరీ తులసీ లక్ష్మణమూర్తి, పీవీ సేవా సమితి అధ్యక్షుడు వెంకట రెడ్డి, అలయన్స్ క్లబ్ సెక్రటరీ మనోజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకులు MD ఖలీద్ హుసేన్, ఉప్పు శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్, కొండ గణేష్, జలీల్, రావుల తిరుపతి రెడ్డి, బెజ్జుగం ఇంద్రకరణ్, పందిళ్ళ విజయేందర్, మాగంటి శ్రీధర్, గట్టు మహదేవ్, గాజుల చారుదత్త, బీమోజు సదానందం,పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సాగి వీర భద్రరావు, వెంకట రాజం, వేణుమాధవ్, శ్రీనివాస్, తాటిపెల్లి రాజన్న, ఇందుర్తి నరేష్, రమేష్ శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.