21-08-2025 10:48:23 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల కేంద్రంలో డిఈవో ఆదేశాల మేరకు 29-30 వరకు పాఠశాల(స్కూల్ గేమ్స్) ఫెడరేషన్ క్రీడా పోటీలు నిర్వహించబడతయాని ఎంఈవో నాగారం శ్రీనివాస్ అన్నారు. అండర్ 14, 17 విభాగాలల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీ బాల్ క్రీడా పోటీలను బాల,బాలికలకు నిర్వహించ బడుతాయాని అన్నారు. అండర్ 14 లో పాల్గొనే వారు 01/01/2012 నాడు (లేదా) ఆ తర్వాత పుట్టిన వారు, అండర్ 17 వారు 01/01/2009 నాడు (లేదా) తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులని, అందుకు తగిన ఆధారమైన బోనాఫైడ్ ను సమర్పించాలని అన్నారు. గురువారం నాడు ఎంఈవో నాగారం శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం ఎంఈవో కార్యాలంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ పీడీ, రమేష్ పీడీ, రాజేందర్ పిఈటి, రాజు పిఈటి, సుమలత పిఈటి, కవిత పిఈటి, లక్ష్మణ్ ఐసీ ప్రధానోపాధ్యాయులు, శివకుమార్ సీఆర్పి పాల్గొన్నారు.