calender_icon.png 22 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సిటిజన్లను యువత ఆదర్శంగా తీసుకోవాలి

21-08-2025 10:50:39 PM

జిల్లా అదన కలెక్టర్ చందర్ నాయక్..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): సీనియర్ సిటిజనులను యువత ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్(District Additional Collector Chander Nayak) అన్నారు. గురువారం కామారెడ్డిలో రోటరీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. సీనియర్ సిటిజన్ల అనుభవం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీనియర్ సిటిజన్స్ అనుభవం, మార్గదర్శకత్వం సమాజానికి అమూల్యమని, యువత వారికి ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న  రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డా. ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, రోటరీ ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్‌ను సన్మానించడంతో పాటు, పలు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సన్మానితులు తమ అనుభవాలు పంచుకుంటూ రోటరీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ అధ్యక్షులు పున్నా రాజేశ్వర్, కార్యదర్శి ఎం. రాజన్న, రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, కోశాధికారి రమణ కుమార్ ,రోటరీ సభ్యులు బాలకిషన్, ధనంజయ్, కాశీనాథం, పున్నా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.