calender_icon.png 22 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ఉల్లాస్ ప్రోగ్రామును విజయవంతం చేయండి

21-08-2025 10:59:08 PM

నల్లబెల్లి ఎంపీడీవో రవి

నర్సంపేట/నల్లబెల్లి (విజయక్రాంతి): నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ వయోజన విద్యా కార్యక్రమాన్ని నల్లబెల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని 29 గ్రామ పంచాయతీల ఉపాధ్యాయులకు, స్వయం సహాయక సంఘాల వివోఏ(విలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలకు) ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి అనురాధ(Mandal Education Officer Anuradha) అధ్యక్షతన, ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో పి రవికుమార్ హాజరయ్యారు.

అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 15 సంవత్సరాలు పైబడిన పాఠశాల విద్యకు దూరంగా ఉన్న నిరక్షరాష్యులను, అక్షరాస్యులుగా చేయడం కోసం మండలంలోని వివోఏలు, ఉపాధ్యాయులు వాలంటరీ టీచర్లకి శిక్షణ ఇచ్చి ఉల్లాస్ ప్రోగ్రాం విజయవంతం చేసి మండలంలో గల నిరక్షరాష్యులను అక్షరాస్యులుగా చేయవలసిందిగా సమావేశ ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య ఏపీఎం సుధాకర్, నల్లబెల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, ఉల్లాస్ ఆర్పీలు ఉడుత రాజేందర్, సిహెచ్ స్వరాజ్యం, సిసిఏలు ఎంఆర్సి సిబ్బంది రాజేశ్వరి, విజయ్ కుమార్ ఆనందం, సిఆర్పీలు రవి, రాంబాబు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.