21-08-2025 10:54:48 PM
లేగ దూడ, ఎద్దులపై దాడి..
ధ్రువీకరించిన ఫారెస్ట్ అధికారులు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దేవాపూర్ అటవీ ప్రాంతం(Devapur forest area)లో పెద్దపులి ఒక దూడ, రెండు ఎద్దులను బలి తీసుకున్న సంఘటన కలకలం రేపింది. దేవపూర్ అటవీ ప్రాంతంలోని దొండ్ల గ్రామ శివారులో ఎద్దు, రెండు దూడలను చంపిన పెద్దపులి రెచ్చిపోయింది. తిర్యాణి మండలంకి చెందిన తుమ్రం మలుకు చెందిన ఎద్దు శేఖర్ కు చెందిన ఆవు, తుంరం బీముకు చెందిన లేగ దూడ పెద్దపులి దాడిలో మృత్యువాతపడ్డాయి. సమాచారం తెలియగానే ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి ధ్రువీకరించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు పంచనామ చేశారు.