21-08-2025 11:02:04 PM
ప్రశాంత చవితి వేడుకలకు సహకరించాలి..
ఎస్సై సైదులు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్స్ వాడవద్దని భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్ఐ ఈట సైదులు(SI Saidulu) కోరారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని పోలీస్ స్టేషన్లో మండలంలో గల డీజే సౌండ్స్ యజమానులకు డీజే సౌండ్స్ వాడటం వల్ల జరిగే అనర్ధాలు, అట్టి సౌండ్స్ వాడితే తీసుకునే చర్యల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లోని పెద్దలందరూ యువతకు పలు సూచనలు చేస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరిగేలా చూడాలని కోరారు.
ప్రతీ గణేష్ మండపాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇట్టి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలని అన్నారు. అనంతరం డీజే సౌండ్స్ యజమానులను మంచి ప్రవర్తన కోసం తహాశీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు,రెవెన్యూ సిబ్బంది, డీజే సౌండ్స్ యజమానులు పాల్గొన్నారు.