10-09-2025 07:11:56 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మండలంలోని ట్రాక్టర్ యజమానులతో జరిగిన సమావేశంలో తహసీల్దార్ మణిధర్(Tahsildar Manidhar) మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా రవాణా చేయడానికి ఆయా పంచాయతీ కార్యదర్శులు కూపన్లు మంజూరు చేస్తారని తెలిపారు. కూపన్లు మంజూరైన ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చేయాలని, కూపన్లు లేని వాహనాలు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఇసుక సరఫరా చేయాలని, అధిక వసూళ్లకు పాల్పడితే సంబంధిత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండలంలోని ట్రాక్టర్ యజమానులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.