calender_icon.png 10 September, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

10-09-2025 07:19:24 PM

మఠంపల్లి: ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మఠంపల్లి మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తాహశీల్దార్ లావురి మంగకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్, మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ మాట్లాడుతూ మఠంపల్లి మండలంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 540 సర్వే నెంబర్ లాగిన్ ఇవ్వాలని, కృష్ణ తండా నుండి సుల్తాన్ పురం తండా వరకు బిటి రోడ్డు వేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు పంపిణీ చేయాలని, వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ల కొరకు దరఖాస్తు పెట్టుకున్న వారికి పెన్షన్లు మంజూరీ చేయాలని,యూరియా కొరతను నివారించి రైతులకు సరిపడా యూరియా అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు నున్న గోపుల లక్ష్మమ్మ, కె. వెంకట్ రెడ్డి, కంటుకోటయ్య, వినోద్, భూక్య కేశ్య మాలోతు లలిత,చీనా,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.