calender_icon.png 10 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్దే.. నియోజకవర్గ అభివృద్ధి

10-09-2025 07:08:47 PM

రూ.14.75 కోట్లతో రోడ్ల నిర్మాణాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

రేగొండ (విజయక్రాంతి): గ్రామాలు అభివృద్ధి చెందితేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Bhupalpally MLA Gandra Satyanarayana Rao) అన్నారు. బుధవారం ఎమ్మెల్యే రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన రహదారుల నిర్మాణాలకు రూ.14.75 లక్షలతో శంకుస్థాపనలు చేశారు. రేగొండ మండలంలోని భాగిర్థి పేటలో రూ.30 లక్షలు, గూడెపల్లి గ్రామం నుండి పొనగండ్ల వరకు రూ.160 లక్షలు, కొడవటంచలో రూ.29 లక్షలతో కొత్తగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. దమ్మన్నపేట గ్రామంలో పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు రూ.4.95 లక్షలు, కొత్తపల్లి గోరీ మండలంలో వెంకటేశ్వర్ల పల్లిలో మైదాకుల పల్లి నుండి బుగులోని జాతర వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.150 లక్షలు, అలాగే స్మశాన వాటిక రోడ్డు నిర్మాణ పనులు రు.30 లక్షలు, సుల్తాన్ పూర్ లో రూ.50 లక్షలు, కొత్తపల్లి గోరీలో వ్యవసాయ పొలాల రోడ్లకు రూ.60 లక్షలు, నిజాంపల్లిలో రూ.40 లక్షలు, చిన్న కోడేపాకలో రూ.20 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. 

అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే కొత్తపల్లి గోరీ మండలంలోని సుల్తాన్ పూర్ వయ వెంకటేశ్వర్ల పల్లి, కోనరావుపేట టూ కొత్తపల్లి గ్రామాలను కలుపుతూ సిఆర్ఆర్ నిధులు రూ.4.50 కోట్లు, ఐటీడీఏ నిధులు రూ.2.75 కోట్లు ఈ మొత్తం నిధులతో  బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ,భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, రేగొండ టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్సార్ సంపత్ రావు, సూరం వీరేందర్,పున్నం రవి, మేకల బిక్షపతి, పోనుగంటి వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సమైక్య భవనం మంజూరు చేయాలని మహిళల వినతి..

వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో గ్రామ సమైక్య భవనం మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు శివమణి గ్రామ సమైక్య మహిళలు తమ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో మొత్తం 25 సంఘాలు ఉండగా 320 మంది సభ్యులు ఉన్నారని ప్రతినెల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గదులు లేక ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యేను కోరగా త్వరలో భవనం మంజూరు ఇచ్చి శంకుస్థాపనకు వస్తానని మహిళలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.