calender_icon.png 6 January, 2026 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటికి అసెంబ్లీ, మండలి సమావేశాలు వాయిదా

04-01-2026 01:09:41 AM

  1. సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ
  2. చర్చకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ వాకౌట్

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శనివారం సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకు ముందు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెం బ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకు కేసీఆరే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీజేపీకి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపో యారు. ఇక సభలో కాంగ్రెస్, ఎంఐ ఎం, సీపీఐ సభ్యులు మాత్రమే మిగిలారు. అంతకుముందు రోజే బీఆర్‌ఎస్ కూడా వాకౌట్ చేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో హిల్ట్ పాలసీపైన చర్చ జరగనున్నది. షార్ట్ డిష్కషన్‌లో ఈ అంశంపై చర్చను చేపట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ పాలసీపైన సమగ్ర చర్చ చేపట్టనున్నది.