calender_icon.png 3 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాల్కన్ స్కామ్‌లో 18 కోట్ల ఆస్తులు జప్తు

02-08-2025 02:08:57 AM

  1. రూ.792 కోట్ల మోసం నిర్ధారణ
  2. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): మల్టీలెవెల్ మార్కెటింగ్ ముసుగులో అధిక లాభాల ఆశ చూపి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఫాల్కన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మ రం చేసింది. సంస్థకు చెందిన రూ. 18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను జప్తు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. అమర్‌దీప్ కుమార్ నేతృత్వం లోని ‘మెస్సర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ అనే పథకం పేరుతో ఈ భారీ మోసానికి తెరలేపిం ది.

నమ్మశక్యం కాని రీతిలో అధిక రా బడులు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. మొత్తం 7,056 మంది మదుపరుల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో 4,065 మంది బాధితులకు రూ.792 కోట్లు తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో స్పష్టంగా నిర్ధారణ అయింది.

ఈ నిధులతో నిందితులు విలాసవంతమైన జీవితం గడిపినట్లు ఈడీ గుర్తిం చింది. ఇందులో భాగంగా, అక్రమ డబ్బుతో కొనుగోలు చేసిన ఒక ప్రైవేట్ జెట్ (హాకర్ 800 ఏ)ను ఈడీ అధికారులు గతంలోనే స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రూ.18.14 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేశారు.

ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన అమర్‌దీప్ కుమార్‌తో పాటు సంస్థలోని ఇతర డైరెక్టర్ల పాత్ర పై కూడా ఈడీ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ స్కామ్‌కు సంబంధించిన మరిన్ని ఆస్తులను గుర్తించి, వాటిని కూడా త్వరలోనే జప్తు చేసే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.