02-08-2025 02:10:39 AM
బీజేపీ నేత ఎన్వీ సుభాష్
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులను హేళనచేసేలా మాట్లాడటం సిగ్గుచేటంటూ బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి ఎన్ సుభాష్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల పట్ల హేళనగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ఆలో చనా ధోరణికి నిదర్శనమని శుక్రవా రం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. గౌరవప్రదమైన వృత్తిని కించప రచే చర్యగా అభివర్ణించారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు ఎన్నో కష్టాలను భరిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటే వారిని ఈ విధంగా కించపర్చడమేంటని నిలదీశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ “రాజ్యాంగాన్ని కాపాడాలి” అంటూ నీతులు చెబుతుంటే... రా జ్యాంగంలో నాలుగో స్థంభంగా పేర్కొ న్న మీడియాపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు.
మీడియా పై కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా మా ట్లాడటం చూస్తే వారి నిజస్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే మీడియాపై వివక్ష ఉందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాం ధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు మీడియాను అణచివేసిన అంశం అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అదే ధోరణిని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయక త్వంలో, రేవంత్ రెడ్డి ప్రవర్తన ఎమర్జెన్సీ 2.0కి ముందుచూపులా కనిపిస్తోందన్నారు.