17-08-2025 12:49:15 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాం తి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డలో రెం డు పిల్లర్లకు పగుళ్లు వచ్చినందుకే కూలేశ్వ రం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-, బీ జేపీ నేతలకు పోలవరం ప్రాజెక్టును ‘కూలవరం’ అనే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ హోదా ఇచ్చిన పోలవరం కాపర్ డ్యామ్, రెండోసారి కొట్టుకుపో యి నా కనిపించడం లేదా అంటూ శనివారం కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణకు వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీ తి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవ లం 24 గంటల్లోపే ఎన్‌డీఎస్‌ను దించి బీఆర్‌ఎస్‌పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముం దు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాపర్ డ్యామ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు.
ఏకంగా 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతుకు కుం గిన పోలవరం కాపర్ డ్యామ్‌కు గుట్టుచప్పు డు కాకుండా ఏపీలో యు ద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తుంటే.. తెలంగాణలో మా త్రం 20నెలలు కావొస్తున్నా మేడిగడ్డ బరా జ్ వద్ద తట్టెడు సిమెంట్‌కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్‌రెడ్డి మూ ర్ఖత్వమేనని ఆరోపించారు.
2020లో పోలవరం డయాఫ్రమ్ వాల్ రెండేండ్లకే కొట్టుకు పోయినా ఇప్పటికీ ఊలుకూ, పలుకూ లేద ని, మరోసారి ఏపీలో పోలవరం కాపర్ డ్యా మ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మ రణించినా ఇప్పటికీ ఎన్‌డీఎస్‌ఏ అడ్రస్ లేదన్నారు.
పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలం గాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దే శానికే అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ రైతు ను తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న మూ కుమ్మడి కుట్రలను కాలరాస్తామని, తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.