17-08-2025 01:24:36 AM
గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలనే మాట చిత్ర పరిశ్రమలో చాలా పాపులర్. అందా ల భామ అనన్య నాగళ్ల కెరీర్‌ను చూస్తే ఇదే అనిపిస్తోం దిప్పుడు. అందచందాలు, అభినయం.. ఏవీ ఈ హాట్ బ్యూటీకి కలిసి రావడంలేదు. బీటెక్ పూర్తి చేసి, ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్నీ వదిలే సి మరీ ఫుల్‌టైమ్ హీరోయిన్‌గా మారిందీ సత్తుపల్లి చిన్నది. చక్కని శరీర సౌష్ఠవమే కాదు..
ప్రతిభావంతురాలనిపించుకుంది! జాబ్ చేసే రోజుల్లోనే ‘షాదీ’ అనే లఘు చిత్రంలో నటించిన ఈమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ రావడమే ఇందుకు నిదర్శ నం. తర్వాత ప్రియదర్శికి జోడీగా ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. పవన్‌కల్యాణ్ ‘వకీల్ సాబ్’తో మంచి గుర్తిం పు తెచ్చుకుంది. ఆ తర్వాతి చిత్రాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడికి కెరీర్ పరంగా మాత్రం సంతృప్తికరంగా లేదు.
మొత్తం 12 సినిమాల్లో నటిస్తే, రెండు సక్సెస్ అయ్యాయి. తొలి నాళ్లలోనే వరుస ఆఫర్లు, స్టార్స్‌తో స్క్రీన్ పంచుకున్నానన్న గర్వాన్ని ప్రదర్శించకుండా సెకండ్ హీరోయిన్ అవకాశాన్నీ కాదనలేదు. చిన్న పాత్రలనూ చిన్నచూపు చూడలేదు. ప్రకటనలు, ప్రారంభోత్సవాలతో ఎంత బిజీగా ఉన్నా హీరోయిన్‌గా బిజీ అయి, స్టార్‌డమ్ దక్కితే ఆ క్రేజే వేరు! దేనికైనా కాలం కలిసి రావాలంటారు. ఆ టైమ్ అనన్యకూ రావాలని కోరుకుందాం.