calender_icon.png 5 May, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ ఇవ్వడంలో ఏటీసీలది కీలకపాత్ర

05-05-2025 06:17:06 PM

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ...

మందమర్రి (విజయక్రాంతి): గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ ఇవ్వడంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లది కీలకపాత్ర అని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ(Peddapalli MP Vamshi Krishna) అన్నారు. పట్టణంలోని ఏటిసి సెంటర్ ను సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఎటీసీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి చర్చించారు. విద్యార్థుల అవసరాలు, సమస్యలు, కేంద్రంలోని ప్రత్యేకతలను ఎంపీ సమీక్షించారు.

టెక్నికల్ శిక్షణ, ఉపకరణాల అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఎటీసీ లను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ మార్గదర్శకాలు రూపొందించి యువతను తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ దేవానంద్, వివిధ శాఖల అదికారులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.