calender_icon.png 6 May, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది

05-05-2025 08:50:24 PM

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ..

మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ ఫలితాలలో మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరిలతో కలిసి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల బాలికల జూనియర్ కళాశాల నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎ. లిఖిత, షేక్ సీద్రాకొహిన్, ద్వితీయ సంవత్సరంలో బి. సాత్విక, ఎండి. అజార్బో, బెల్లంపల్లి బాలికల జూనియర్ కళాశాల నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మహెక్ నజ్నీన్, ద్వితీయ సంవత్సరంలో జునైర సాబా, నిదాఫిర్డోస్, చెన్నూర్ బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రథమ సంవత్సరంలో ఎన్. అభిరామ్, ఓ.సిద్దు, ద్వితీయ సంవత్సరంలో బి. వరుణ్ తేజ, ఎండి. అమన్ లు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు.

ఎస్.ఎస్.సి.లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని బెల్లంపల్లి బాలికల పాఠశాల నుండి డి. అక్షయ, సుహైర్య, మంచిర్యాల బాలికల పాఠశాల నుండి ఆర్.వైష్ణవి, డి. రిషిత, ఎస్.వైశాలి, చెన్నూర్ బాలుర పాఠశాల నుండి ఎండి. సమీర్, ఎండి. ఫిరోజ్, ఎస్.రాంసూరి లు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. విద్యా రంగంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.