05-05-2025 06:19:59 PM
హాజరుకానున్న ప్రముఖులు..
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి రోడ్డులోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయములో బుధవారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని ఆలయ అధ్యక్షులు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటయ్య చారి, కోశాధికారి బెజ్జంకి బ్రహ్మయ్య చారి తెలిపారు.
ఈ మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, విశిష్ట అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆత్మీయ అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, భద్రకాళి దేవస్థానం చైర్మన్ భద్రకాళి శేషు, 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, మామునూరు ఏసిపి బొంపెల్లి తిరుపతి తదితరులు హాజరవుతారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.