calender_icon.png 6 May, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక మిస్సింగ్

05-05-2025 08:36:12 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన బాలిక మిస్సింగ్ అయినట్లు ఎస్సై తెలిపారు. ఈ బాలిక పంకెనలోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటుంది. బాలిక 2వ తేదీ శుక్రవారం రోజున తన తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటిలో నుండి వెళ్లిపోయినది. బాలిక తల్లిదండ్రులు చుట్టుప్రక్కల గ్రామాలలో, బంధువుల ఇండ్లలో వెతకగా ఎక్కడా కనిపించలేదు. బాలిక తల్లి తీగల రజిత మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.