05-05-2025 08:14:08 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని శారద హైస్కూల్ లో 2003-04 పదవ తరగతి పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులందరు ఆత్మీయ అనురాగ పూర్వక పలకరింపులు నడుమ 22 సంవత్సరాల నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.
చిన్ననాటి నాటి మిత్రులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన ఆనాటి గురువులు శారద హై స్కూల్ హెచ్ఎం టి.శారద లక్ష్మీనరసింహారావు, ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులు వారి యొక్క అనుభవాలను ప్రస్తుతం వాళ్లు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు, కుటుంబ సభ్యుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఫంక్షన్ హాల్ మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.