calender_icon.png 6 May, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ రాష్ట్ర వాహన దొంగ అరెస్ట్

05-05-2025 08:44:50 PM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి-కొత్తగూడెంలో అంతర్ రాష్ట్ర వాహన దొంగ అశ్వరావుపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సోమవారం అశ్వారావుపేట పోలీసులు సాధారణ వాహనల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణంగా అసలు విషయం బయట పడ్డిందని పోలీసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్టగట్లగూడెంకు చెందిన ముత్యాల గణేష్ (33) అనే నిందితుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు అంగీకరించాడు.

అంతర్రాష్ట్ర వాహన దొంగను అరెస్టు చేసి, దొంగిలించబడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, దమ్మపేటలో ఒకటి, ఏలూరు జిల్లాలోని తడకపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఆరు మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పుట్టగట్లగూడెం గ్రామంలో ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేసే గణేష్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం వాహన దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.