05-05-2025 08:21:51 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్సనర్స్ జాయింట్ ఆక్షన్ రాష్ట్ర కమిటీ(TGEJAC) పిలుపు మేరకు సోమవారం ఉద్యోగులు బెల్లంపల్లి ఎమ్మెల్యే సభ్యుడు గడ్డం వినోద్(MLA Gaddam Vinod) ను కలిసి సమస్యలు విన్నవించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను వివరించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఉద్యోగుల సమస్యల పరిషాకారానికి తమవంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఉద్యోగుల కుంటుంబలకు చేయుతను అందించాలని విజ్ఞప్తి 57 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్బంగా శాసనసభ సభ్యుడు గడ్డం వినోద్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికెళ్లి సమస్యల పరిషాకారానికి కృషి చేస్తానని ఉద్యోగులకి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చిన వారిలో టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి, రాష్ట సెక్రెటరీ పొన్నం మల్లయ్య, డిప్యూటి సెక్రెటరీ జనరల్ భూముల రామ్ మోహన్, కో-చైర్మన్ శ్రిపతి బాపూరావు చక్రపాణి, రవి, చెన్న కేశవులు, రసుధాకర్ గోపాల్, వెంకటేశం సంఘ సభ్యులు ఉన్నారు.