31-07-2025 01:01:26 AM
- బాధ్యతతో పని చేసి రైతులకు న్యాయం చేయాలి
- తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి
వనపర్తి జూలై 30 ( విజయక్రాంతి ): ఆత్మకూరు మార్కెట్ యార్డులో బుధవారంమార్కెట్ కమిటి నూతన పాలక మండలి సభ్యులను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు మరియు మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్లా కొత్వాల్, మాజీ క్రికెటర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆత్మకూరు మార్కెట్ కమిటి చైర్మన్ గా యం.డి. రాహమతుల్ల, వైస్ చైర్మన్ గా కృష్ణా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 12 మంది పాలక మండలి సభ్యులు ఎన్. వెంకటయ్య, యం. నరేష్, మణెమ్మ, ఎన్. సత్యన్న, ఎస్. శ్యాం కుమార్, టి. రవికాంత్, డి. మోహన్, యం. కమలాకర్ గౌడ్, యం. అరవింద్ రెడ్డి, విష్ణు, బి. గోవర్ధన్, టి. రాజు సైతం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకమండలిలో చైర్మన్ గా రాహమతుల్ల, వైస్ వైస్ చైర్మన్ గా కృష్ణారెడ్డి వారి పాలకమండెం మండలి సభ్యుల బాధ్యతలు పెరిగాయని, చాలా బాధ్యతతో పని చేసి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. పాలక మండలిలో సభ్యులను వారి సేవ, అర్హతలను బట్టి ఇచ్చాము తప్ప డబ్బులకు ఇవ్వలేదని చెప్పారు. పాలక మండలి బాధ్యతాయుతంగా పనిచేసి ఈ ప్రాంతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం రుణాలు ఇప్పించడం వంటి మంచి కార్యక్రమాలు చేసి మార్కెట్ యార్డు కు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు.
పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.