calender_icon.png 7 October, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి

07-10-2025 01:28:46 AM

-ప్రభుత్వానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ విజ్ఞప్తి 

ఖైరతాబాద్; అక్టోబర్ 6(విజయ క్రాంతి) : ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన నాలుగు మాదిగ కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మాజీ మంత్రి మో త్కుపల్లి నరసింహ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివి ధ సంఘాల ప్రతినిధులు ఇటుక రాజు, శ్రీనివాస్, బొంకూరి సురేందర్ తదితరులతో కలిసి మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపా రు. 1994 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమ కాలంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నెక్లెస్ రోడ్‌లో ఎకరం భూమిని కేటాయించి 100 అడుగుల ఎత్తు లో అమరవీరుల స్తూపం నిర్మింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘా ల ప్రతినిధులు భీమాశంకర్, పొన్నాల యాదయ్య, జనార్ధన్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.