calender_icon.png 21 August, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగంపై దాడి కొనసాగుతోంది.. ఖర్గే ఆరోపణలు

13-08-2024 03:33:23 PM

ఢిల్లీ: రాజ్యాంగంపై దాడి కొనసాగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పీసీసీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జుల సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కుల గణనను ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు.  సైన్యంలో చేరాలనే యువజనుల ఆశలను నీరుగారుస్తున్న అగ్నిపథ్ స్కీం ను రద్దు చెయ్యాల్సిందేనని    ఖర్గే డిమాండ్ చేశారు.పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కలిపించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. నిరుద్యోగం నిర్మూలించడం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా  కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పోరాడుతుందని తెలిపారు.