13-08-2024 03:32:47 PM
పెద్దాపూర్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ ల తల్లిదండ్రులు మంత్రుల ముండు బోరున విలపించారు. ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్చార్జి మున్సిపల్ మహిపాల్ రెడ్డిని విచారించి, మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేయిస్తున్నారా..? అని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ను అడిగారు. గురుకుల పాఠశాలలో ఉన్న వసతులు, సిబ్బంది, పాఠశాలలో డ్యూటీ నర్స్ సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అధికారుల నిర్లక్ష్యం మా పిల్లల పాలిట శాపంగా మారిందంటూ డిప్యూటీ సీఎం భట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.