07-10-2025 10:42:58 PM
మేడ్చల్ (విజయక్రాంతి): రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం చెక్పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కోమటి ఎల్లం(35) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టణంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కంటైనర్ 2 వాహనాలను ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరుసటి రోజు మరో ప్రమాదం జరగడంతో స్థానికులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు.