07-10-2025 10:18:14 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): టిఫిన్ సెంటర్ క్యాషియర్ పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అవుషాపూర్ లోని యాదాద్రి టిఫిన్ సెంటర్ నందు క్యాషియర్ గా పనిచేస్తున్న బోర్ల సీమన్ పై ఇద్దరు వ్యక్తులు టింకు అలియాస్ శేఖర్ రెడ్డి, సన్నీ అలియాస్ మణిదీప్ రెడ్డి టిఫిన్ సెంటర్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అతనిని బూతులు తిడుతూ చేతులతో కొట్టినట్లు తెలిపారు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.