07-10-2025 10:29:12 PM
తాండూరు (విజయక్రాంతి): తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసం బషీరాబాద్ లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం. బషీరాబాద్ మండలానికి చెందిన జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన చర్చ జరిగింది. సర్వే ప్రకారం గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని.. ఎంపీపీ పీఠం తమ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కోరినట్లు తెలిసింది. ఇంకా ఈ భేటీలో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బషీరాబాద్ మండల నాయకులు ఉన్నారు.